- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంకెంతమందిని చంపుతవ్ దొర.. కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థి ఇక్బాల్, ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడంతో నిరాశ చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వందల సంఖ్యలో నిరుద్యోగులు చనిపోతున్నా ఉద్యోగాలు కల్పించకుండా కేసీఆర్ రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇంకెంత మందిని చంపుతావ్ కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయలేకపోతే వెంటనే రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. అచ్చమైన పల్లె భాషతో అన్యాయంపై గొంతెత్తిన ప్రజాకవి, ప్రజల కోసం నిరంతరం పరితపించిన భాషాభిమాని అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Civil Engg చేసి కూడా
ఉద్యోగాలు దొరకక నిరాశలో తమ్ముడు ఇక్బాల్
ఆత్మహత్య చేసుకున్నాడు నిన్న. ఇది KCR చేసిన హత్య. వందల్లొ
నిరుద్యోగులు చనిపోతుంటే ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి,
రాక్షసానందం పొందుతున్నాడు KCR. ఇంకెంత మందిని చంపుతవ్ దొరా? నోటిఫికెషన్స్ విడుదల చేయలేకపోతే రాజినామా చెయ్ pic.twitter.com/GhBkhPs4wU— YS Sharmila (@realyssharmila) September 9, 2021