- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఎం సాబ్..6,200 కోట్లిచ్చి ఏపీని ఆదుకోండి: విజయసాయి రెడ్డి
ఆర్ధిక సాయం చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్టణంలో మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రధానికి తాను కొన్ని వినతులు చేశానని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, ఏపీకి తక్షణ సాయంగా 6200 కోట్ల రూపాయలు అదజేయాలని కోరానని చెప్పారు. దేశ వ్యాప్తంగా ,19 రాష్ట్రాలలో 78 హాట్ స్పాట్‌లను కేంద్రప్రభుత్వం గుర్తించిందని ఆయన అన్నారు. ఆ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్ కొనసాగిస్తూ, మిగిలిన ప్రాంతాల్లో దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని కోరామని ఆయన తెలిపారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారికి కరోనా టెస్టులు చేసి, నెగటివ్ వచ్చిన వారిని స్వస్ధలాలకి పంపాలని ప్రధానిని కోరామని ఆయన చెప్పారు. ఇంట్లో ఉంటూ శానిటేషన్ చేసుకునే పద్దతులపై ప్రజల్లో చైతన్యం కలిగేలా ప్రసార మాధ్యమాల ద్వారా కార్యక్రమాలు రూపొందించాలని కేంద్రాన్ని కోరామని ఆయన అన్నారు.
డ్వాక్రా మహిళలకి మాస్క్‌లు, గ్లౌవ్స్ ఎలా తయారు చేయాలన్న దానిపై టీవీల ద్వారా శిక్షణ ఇవ్వాలని కేంద్రానికి సూచించామని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ గతంలో చేపట్టిన స్వచ్చ భారత్ కార్యక్రమం వల్ల దేశానికి చాలా మేలు జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపీల రెండేళ్ల జీతం కరోనా సహాయార్థం కట్ చేస్తున్నట్టు తెలిపిన నేపథ్యంలో మన ఎంపీల జీతం మన సీఎం సహాయ నిధి అకౌంట్లో పడేలా చర్యలు తీసుకోవాలని కోరామని ఆయన చెప్పారు. కరోనా కట్టడికి అవసరమైన అన్ని వైద్య పరికరాలు ఏపీలో సిద్దంగా ఉంచాలని పీఎంకు సూచించామని తెలిపారు.
ఏపీలోని 1.50 కోట్ల కార్డుల రేషన్ పంపిణీ కారణంగా 900 కోట్ల రూపాయలు అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుందని, అలాగే కరోనా లాక్‌డౌన్ కారణంగా పేదలకు అందజేస్తున్న వెయ్యి రూపాయిల పంపిణీ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ఖజానాపై మరో 500 కోట్ల రూపాయల భారం పడుతోందని ఆయన చెప్పారు. ఈ మొత్తం 1400 కోట్ల రూపాయల భారాన్ని పంచుకోవాలని కోరామని ఆయన తెలిపారు. ఈ భారానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నెలవారీగా 4800 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, రాష్ట్రానికి తక్షణ సాయంగా 6,200 కోట్ల రూపాయలు అందించాలని కోరామని ఆయన తెలిపారు.
Tags: vijaya sai reddy, andhra pradesh, ysrcp, ysrcp mp, visakhapatnam, pm modi