- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీలో నన్ను ఇబ్బంది పెడుతున్నారు : రోజా
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెన్నుపోటు నాయకులున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని..వారిని పార్టీ ఇప్పటికైనా గుర్తించాలని సూచించారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ కొందరు మీడియా ముందుకు వచ్చి వైసీపీ రక్తం తమలో ప్రవహిస్తోందని చెప్పడం ఆశ్యర్యంగా ఉందన్నారు. నగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కొంతమంది నాయకులు తమ అనుచరులను వైసీపీ రెబెల్స్‌గా పోటీకి నిలబెట్టి పార్టీ అభ్యర్థులను ఓడించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.
తన నియోజకవర్గం పరిధిలోని మున్సిపల్ వార్డులను ఏకగ్రీవం చేసేందుకు చాలా ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు. అయితే కొందరు వైసీపీ నేతలే తన ప్రయత్నాలను అడ్డుకున్నారని ఆరోపించారు. తన అనుచరులు పోటీ నుంచి తప్పుకొన్నప్పటికీ.. సొంత పార్టీ నేతలు తిరుగుబాటు అభ్యర్థులను పోటీలో నిలిపారని.. వారికోసం భారీగా డబ్బులను పంచారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగానైతే వైసీపీ ఘన విజయం సాధించిందో అదే విధంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధిస్తుందని రోజా దీమా వ్యక్తం చేశారు. నగరంలోని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని రోజా కోరారు. సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని ప్రజలు ఓటు వేసి సమర్ధించాలని రోజా కోరారు.