- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్సైని చెప్పుతో కొట్టి సారీ చెప్పిన వైఎస్సార్సీపీ నేత
ఎస్సైని చెప్పుతో కొట్టిన రాజకీయ నాయకురాలు క్షమాపణలు చెప్పిన ఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం జిల్లాల్లో ప్రజా చైతన్య యాత్ర చేపట్టేందుంకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాబు యాత్రను వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. బాబు యాత్రను అడ్డుకునేందుకు భారీ స్థాయిలో వైఎస్సార్సీపీ శ్రేణులు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో కొందరు అత్యత్సాహం ప్రదర్శించారు.
అలా అత్యుత్సాహం ప్రదర్శించిన పలువురు టీడీపీ వ్యతిరేక నినాదాలు చేస్తూ, విమానాశ్రయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అడ్డాల క్రుపా జ్యోతిని విమానాశ్రయ ఎస్సై ఎన్. సునీత అడ్డుకున్నారు. దీంతో క్రుపా జ్యోతి తీవ్ర ఆగ్రహానికి గురై చెప్పుతో ఆమెపై దాడి చేశారు. ఊహించని దాడితో నివ్వెరపోయిన ఎస్సై కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో నిన్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విషయం తెలుసుకున్న పలువురు వైఎస్సార్సీపీ మహిళా నేతలు స్టేషన్ కు చేరుకుని ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు. ఆమెను పోలీసులు విడిచిపెట్టకపోవడంతో విషయాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ద్రుష్టికి తీసుకెళ్లారు. ఆయన టూటౌన్ డీసీపీ ఉదయ్ భాస్కర్ తో మాట్లాడారు. ఎస్సై సునీతకు క్షమాపణలు చెబుతామని చెప్పడంతో క్రుపా జ్యోతిని స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు.