- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే నాటికి శాసనమండలిలో వైసీపీకి ఆధిక్యం: ప్రభుత్వ సలహాదారు సజ్జల
దిశ, వెబ్ డెస్క్: వచ్చే మే నాటికి మండలిలో వైసీపీకి ఆధిక్యం వస్తుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ చెత్త రాజకీయాలకు చరమగీతం పాడతామని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు సీఎం వైయస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇక్బాల్, కరీమున్సీసా, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథ, దువ్వాడ శ్రీనివాస్, సి.రామచంద్రయ్యలు కలిశారు.
ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులకు సీఎం వైఎస్ జగన్ బీ- ఫామ్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులతో కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు పార్టీ ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు పార్టీ కోసం ముందు నుంచి నిలబడిన వారిని గుర్తించి సమపాళ్లలో సముచిత స్థానం కల్పిస్తున్నట్లు తెలిపారు. కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని పార్టీలో అందరూ గుర్తించారని చెప్పుకొచ్చారు.
అందువల్లే మిగిలిన పార్టీల్లో మాదిరిగా ఎలాంటి ఊహాగానాలు..అసంతృప్తులు వంటివి వైసీపీలో కనిపించవు. ఇది జగన్ నాయకత్వ ప్రతిభకు, సమన్యాయం అందించటంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు ఉదాహరణ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బతిన్న తర్వాత కౌన్సిల్‌లో ఉన్న మందబలాన్ని ఆసరాగా చేసుకొని చెత్తరాజకీయాలు చేసిందంటూ ధ్వజమెత్తారు. సాంకేతిక కారణాలు చూపి రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే పనులు చేయటాన్ని ప్రజలంతా గమనించారన్నారు.
వాటికి కూడా ప్రజలు చరమగీతం పాడారని చెప్పుకొచ్చారు. వచ్చే మేతో వైయస్‌ఆర్‌సీపీకి కౌన్సిల్‌లో మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ తీసుకునే ప్రతీ నిర్ణయానికి ఉభయ సభలూ మద్దతు ఇవ్వటంతో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుంటాయన్నారు. ఉభయ సభలలో తమ పార్టీ ఆధిక్యంలో ఉంటుందని ఫలితంగా ప్రజాఆమోదయోగ్యకరమైన ప్రతీ నిర్ణయం అమలులోకి వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి దీమా వ్యక్తం చేశారు.