సోనియాకు లేని డిక్లరేషన్ జగన్‌కు ఎందుకు? : లక్ష్మీపార్వతి

by Anukaran |   ( Updated:2020-09-23 04:32:43.0  )
ysrcp leader lakshmi parvathi
X

దిశ, వెబ్‌డెస్క్ :

తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థుల ఎంట్రీపై డిక్లరేషన్ తప్పనిసరి అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు. ప్రతిపక్షాలు కావాలనే మతం పేరుతో రెచ్చగొడుతున్నాయని ఆమె మండిపడ్డారు. గతంలో సీఎం మర్రి చెన్నారెడ్డిని దింపేందుకు కూడా మతం పేరుతో అల్లర్లు సృష్టించారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచే వచ్చారని, మతం పేరుతో అల్లర్లు సృష్టించే కల్చర్ ఆయనకు ఇంకా పోలేదని లక్ష్మీ పార్వతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ అడిగారా? అప్పుడు లేని డిక్లరేషన్ సీఎం జగన్‌కు ఎందుకు వర్తిస్తుందని ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు. లోకేష్‌ను సీఎం చేసేందుకు నారా భువనేశ్వరి కనకదుర్గ ఆలయంలో క్షుద్రపూజలు చేసింది.

అమ్మవారి ఆలయంలో క్షుద్ర పూజలు జరిగినప్పుడు బీజేపీ నేతలు ఎక్కడ పోయారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం జగన్ ఏపీ అభివృద్ధి కాంక్షిస్తున్నారని, అలాంటి వ్యక్తికి మతం అంటగట్టడం మంచిది కాదని సూచించారు. ఇదిలాఉండగా, తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టుబట్టలు సమర్పించడానికి సీఎం జగన్ ఇవాళ తిరుపతిలో పర్యటిస్తుండగా.. ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ నాయకులు డిక్లరేషన్‌పై క్లారిటీ ఇవ్వాలని ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed