ముక్కు నేలకు రాసి సీఎంను క్షమాపణ కోరుతా.. షర్మిల బహిరంగ ప్రకటన

by Anukaran |
YS Sharmila
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలో రోడ్‌ షో నిర్వహించిన ఆమె మాట్లాడుతూ… కేసీఆర్, కేటీఆర్‌లు నాతో కలిసి పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సమస్యలు లేవని నిరూపిస్తే.. నా ముక్కు నేలకు రాసి, క్షమాపణ కోరుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లైనా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ సమస్య భయంకరంగా ఉందని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని మండలానికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed