- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే చిన్నారులపై హత్యాచారాలు
దిశ, మణుగూరు : ఏపీ ప్రభుత్వ పాలనలో ఆడ పిల్లలకు బతికే పరిస్థితి లేదని వైయస్సార్‌టీపీ పార్టీ పినపాక నియోజకవర్గ నాయకులు ఆలేం కోటి అన్నారు. ఆదివారం మండలంలోని సురక్ష బస్టాండ్ నుంచి అంబేద్కర్ టీడీపీ సెంటర్ వరకు వైయస్సార్‌టీపీ పార్టీ, రజక సంఘం, మహిళల ఆధ్వర్యంలో కీర్తి పావని హత్యాచారం ఘటనను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆడపిల్లలు సమాజంలో బతికే పరిస్థితి లేదని, ఆడబిడ్డలకు ఎటువంటి రక్షణ లేదన్నారు.
ఆ పార్టీ అసమర్థత వల్లే ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. వైజాగ్ లో చిన్నారి కీర్తి పావనిపై హత్యాచాారం చేసిన నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు మరల పునరావృతం కాకుండా చూడాలన్నారు. నిందితులను ఉరితిస్తేనే మృతురాలు కీర్తి పావని ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో వైయస్సార్‌టీపీ జిల్లా నాయకులు, మండల నాయకులు, రజక సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.