వివేకానందరెడ్డి హత్య కేసు.. టీడీపీ నేతను ప్రశ్నిస్తున్న సీబీఐ

by srinivas |
వివేకానందరెడ్డి హత్య కేసు.. టీడీపీ నేతను ప్రశ్నిస్తున్న సీబీఐ
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహం వేదికగా 26 రోజులుగా విచారణ చేపట్టింది. వివేకానందరెడ్డి వద్ద పనిచేసే ఉద్యోగులతోపాటు ఆయన వెనుక ఉండే పలువురు నేతలను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. శుక్రవారం కడప అలంఖాన్ పల్లెకు చెందిన వ్యాపారి, టీడీపీ నేత లక్ష్మిరెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. వివేక హ‌త్య కేసుకు సంబంధించి పలు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే సీబీ అధికారులు వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి, ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, కడపకు చెందిన రవిశంకర్‌, పులివెందులకు చెందిన కృష్ణయ్య, సావిత్రి దంపతులు, వారి కుమారులు కిరణ్‌కుమార్‌ యాదవ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌లను ప్రశ్నించారు. వీరి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవైపు కడప కేంద్రగారంలో విచారిస్తున్న సీబీఐ అధికారులు శుక్రవారం నుంచి పులివెందులలనూ పలు వివరాలు రాబడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed