పెద్దదిక్కు కోల్పోయిన మహిళకు షర్మిల టీమ్ హెల్ప్

by vinod kumar |
YS Sharmila team
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాతో కుటుంబ పెద్దను కోల్పోయి కష్టాలు పడుతున్న మహిళకు అండగా షర్మిల టీం నిలిచింది. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన తోటిరెడ్డి మాధవరెడ్డి ఇటీవల కొవిడ్ కారణంగా మరణించాడు. షర్మిల ఆదేశాల మేరకు ఆమె అనుచరులు పిట్టా రాంరెడ్డి, వాడుక రాజగోపాల్ బాధిత కుటుంబానికి బుధవారం ఆర్థికసాయం అందజేశారు. కుటుంబ పెద్దలు కోల్పోయిన మహిళలకు అండగా నిలిచేందుకు ‘ఆపదలో తోడుగా వైఎస్ఎస్సార్’ అనే కార్యాక్రమాన్ని షర్మిల ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే తమ ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 040-48213268 కు కాల్ చేయాలని వారు సూచించారు.

Next Story

Most Viewed