రైతులు చావక ఇంకేం చేస్తారు.. కేసీఆర్‌పై షర్మిల ఫైర్

by Anukaran |   ( Updated:2021-09-30 01:48:54.0  )
ys sharmila
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ఆర్‌టీపీ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతు ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘‘ రైతుకు పెట్టుబడి రాకపోతే, పండిన పంట వరద పాలైతే, ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తే, రైతు చావక ఇంకేం చేస్తాడు దొరా. కేసీఆర్ ఒక్క రైతుబంధు ఇచ్చిండు. ఫసల్ భీమా బంద్ పెట్టిండు. పంటలకు బీమా లేదు, రైతుకు ధీమా లేదు, పంటలు వాన పాలు. కష్టం నీటి పాలు. రైతును కన్నీటిలో ముంచిండు.’’ అంటూ ట్వీట్‌లో చురకలు అంటించారు.

అంతేగాకుండా.. ‘‘నేను పెద్ద రైతును అని చెప్పుకొనే దొరగారికి.. రైతు ఆత్మహత్యలు ఎందుకు చేసుకొంటున్నారో తెలియదట. అందుకే కమిటీ వేసిండు. కోర్టులు మొట్టి కాయలు వేయనిదే టీఆర్ఎస్ సర్కార్‌కు సోయి రాదు. కనీసం ఇప్పటికైనా పంటల బీమాను అమలు చేసి రైతులను ఆదుకోండి.’’ అని మరో ట్వీట్‌లో ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story