- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"నాతో వచ్చేదెవరు.. నాతో నడిచేదెవరు"
దిశ,వెబ్‌డెస్క్: రాజన్న రాజ్యమే లక్ష్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు మాజీ దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలా గతవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో షర్మిల హైదరాబాద్ లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఖమ్మం , హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి తో పాటు ఆ పార్టీ నల్గొండ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు తూడి దేవేందర్ రెడ్డిలు భేటీ అయ్యారు. షర్మిలతో ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు రామచంద్రమూర్తి భేటీ అవ్వడం చర్చాంశనీయంగా మారింది. షర్మిలతో భేటీ అనంతరం మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మాట్లాడుతూ షర్మిలను మర్యాద పూర్వకంగా కలిసినట్లు చెప్పారు. ” షర్మిల పార్టీని ఆహ్వానిస్తున్నా. పార్టీ ఎవరైనా పెట్టొచ్చు. రాజకీయాలు ఎవరి సొత్తూ కాదని” కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి స్పష్టం చేశారు.