- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో నిరుద్యోగులు చావే దిక్కు అనుకుంటున్నారు : షర్మిల
దిశ, వెబ్‌డెస్క్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుని ఇప్పటికీ ఏడేండ్లు గడచిన సందర్భంగా వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకోసం అయితే విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకుని ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారో అందుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని షర్మిల విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం పక్కకు పోయి, అధికారం ఒక్క కుటుంబానికే సొంతమైందన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో నిరుద్యోగులు చావే దిక్కు అనుకుంటున్నారని గుర్తుచేశారు. నిరుద్యోగులు చనిపోవడం తెలంగాణ ఉద్యమానికి అవమానకరమన్నారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా పాలకులు మరణ శాసనాలు రాస్తున్నారని షర్మిల రాష్ట్రం ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎంతమంది చనిపోతే ఉద్యోగాలు ఇస్తారో కేసీఆర్ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వెంటనే 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని సీఎం మోసం చేశారన్నారు.