- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కల్వకుంట్ల’ సామ్రాజ్యం కొట్టుకుపోవడం ఖాయం
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కొవిడ్ బారిన పడిన బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవడం ఖాయమని వైఎస్ షర్మిల శనివారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఆలోచిస్తామని చెప్పి ఇప్పటికే ఎనిమిది నెలలు గడిచిపోయిందని, ఇంకెప్పుడు ఆరోగ్యశ్రీలో చేరుస్తారని ఆమె ప్రశ్నించారు.
ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేక పేదలు చస్తున్నారని, చచ్చేవారు పేదలు కాదని ప్రభుత్వం పట్టించుకోవడం లేదా, లేక పేదలు చచ్చినా అడిగేవారు ఉండరనే ధైర్యమా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ప్రభుత్వ లెక్కకు సరిపడా మరణాలు ఇంకా నమోదు కాలేదనా పేద ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ పాలనపై ఇప్పటికే జనం తిరగబడుతున్నారని, కరోనా కారణంగా ఇప్పటికే పేదల బతుకులు రోడ్డున పడ్డాయని, ఇప్పటికైనా వారిని ఆదుకోకుంటే అందుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆమె పేర్కొన్నారు.