- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దమ్ముంటే కేసీఆర్ పాదయాత్రకు రావాలి: వైఎస్ షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు దమ్ముంటే తనతో పాదయాత్రకు రావాలని, వారు రాష్ట్రంలో అసలు సమస్యలే లేవని చెబుతున్నారని, లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి యాత్రను నిలిపివేస్తానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల అన్నారు. చేవెళ్లలో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా.. ముఖ్యమంత్రికి, మంత్రి కేటీఆర్ కి ఆమె సవాల్ విసిరారు. తెలంగాణలో సమస్యలు ఉన్నట్లు నిరూపిస్తే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని, అంతేకాకుండా దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. వారి పాలనపై వారికి నమ్మకం ఉంటే తండ్రీ కొడుకులు తన సవాల్ ను స్వీకరించాలని ఆమె డిమాండ్ చేశారు.
నిరుద్యోగుల సమస్యలపై ఒక్కరోజు నిరాహార దీక్ష చేపడితేనే మంత్రి కేటీఆర్ కు మింగుడు పడలేదని, ఇప్పుడు ఏకంగా పాదయాత్రకే దిగామని ఇప్పుడేం చేస్తారో చెప్పాలన్నారు. ఏడేళ్లలో ప్రతి వర్గాన్ని సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన దొంగ రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడం సిగ్గుచేటన్నారు. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే కాంగ్రెస్ పరిస్థితి మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.