- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో తయారైన పీపీఈ కిట్‌ను ఆవిష్కరించిన జగన్
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేసి, రాష్ట్రంలోకి కొత్త వ్యక్తులెవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. అంతకుముందే రాష్ట్రంలో ప్రవేశించిన వారిపై వలంటీర్లు, ఆశావర్కర్లు, వైద్యసిబ్బందితో నిఘావేసింది. అయినప్పటికీ కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా టెస్టు సొంతంగా నిర్వహించే పీపీఈ కిట్‌ను రాష్ట్రంలో తయారు చేసేందుకు పూనుకుంది.
ఈ ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ సఫలీకృతమైంది. దేశంలో ఈ కిట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి తయారు చేస్తోంది. ఏపీలో తయారు చేసిన కోవిడ్-19 ర్యాపిడ్ టెస్ట్ కిట్‌ను వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి రజత్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా కరోనా ఫలితాల నిర్ధారణ వేగంగా జరుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. 3 లక్షల కిట్లకు ఆర్డరిచ్చినట్టు జవహర్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా నియంత్రణపై పోరులో ఏపీ ఒక అడుగు ముందుకు వేసినట్టైంది. కాగా, ఏపీలో ప్రస్తుతం కరోనా కేసులు 329కి చేరుకున్నాయి. కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి.
Tags: coronavirus, covid-19, andhra pradesh, corona rapid test equipment,