- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా టెస్టుల నిర్వహణలో ఏపీ నెంబర్ టూ: జగన్
కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ దేశంలో రెండో స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి జగన్‌కి అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి నిరోధంపై ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను వెల్లడించారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ వినియోగించకుండానే ఏపీ రెండో స్థానానికి చేరుకుందని అధికారులు తెలిపారు. మరో 3–4 రోజుల్లో టెస్టుల సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు.
ప్రతి 10 లక్షల జనాభాకి అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానానికి చేరుకుందని చెప్పారు. ప్రతి పది లక్షల జనాభాకు రాజస్తాన్ 685 పరీక్షలు చేస్తుండగా, ఏపీలో 539 పరీక్షలు చేస్తున్నారని అన్నారు. ఇకపై రోజూ 17,500కు పైగా టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం అధికారులను ఆదేశించారు. కుటుంబ సర్వేల ద్వారా గుర్తించిన 32వేల మందికి పరీక్షల నిర్వహణ వెంటనే పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు.
కరోనా బీమా కిందకు వాలంటీర్లు, ఆశావర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు చేర్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రతి 2–3 రోజులకోసారి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆయన అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారు చేసిన మాస్కులను ఈ సందర్భంగా జగన్ పరిశీలించారు. ఈ మాస్కులను రాష్ట్రంలో గుర్తించిన రెడ్‌జోన్లకు ముందుగా పంపిణీ చేయనున్నామని అధికారులు తెలిపారు. ప్రతి మనిషికి 3 చొప్పున మాస్కులు పంపిణీకి ఆదేశాలు జారీ చేసినట్టు వివరించారు.
tags: ys jagan, ysrcp, high level review meeting, corona, ap cm,