YSR Bheema :వైఎస్ఆర్ బీమా పథకంలో మార్పులు.. నెలరోజుల్లో చెల్లింపు

by srinivas |   ( Updated:2021-06-09 07:41:01.0  )
YSR Bheema :వైఎస్ఆర్ బీమా పథకంలో మార్పులు.. నెలరోజుల్లో చెల్లింపు
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ బీమా (YSR Bheema) పథకంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) కీలక మార్పులు చేశారు. సంపాదించే వ్యక్తి సహజంగా మరణిస్తే లక్షరూపాయలు బీమా పరిహారం అందించాలని ఆదేశించారు. ‘వైఎస్ఆర్ బీమా’ పథకంపై తాడేపల్లిలో బుధవారం సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌ మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నెలరోజుల్లోనే సాయం అందిస్తుందని తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18-50ఏళ్లు) సహజంగా మరణిస్తే లక్ష, 18-70ఏళ్లు ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణస్తే రూ. 5 లక్షల సాయం అందజేయాలని ఆదేశించారు. జులై1 నుంచి కొత్త మార్పులతో వైఎస్ఆర్ బీమా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జులై 1లోగా సంపాదించే వ్యక్తుల మరణాలకు సంబంధించిన క్లెయిమ్‌లన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో బీమా పరిహారం చెల్లించాలని..అలాగే బీమా పరిహారంపై ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం జగన్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed