- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కట్టడికి ఏపీ మరో సర్వీస్… వైఎస్సార్ టెలీ సేవ
ఆంధ్రప్రదేశ్‌లో కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌తో పాటు కఠిన చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కట్డడికి మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి డాక్టర్ వైఎస్సార్ టెలిమెడిసిన్ కార్యక్రమంగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో కరోనాకు టెలీఫోన్‌లో ఫ్రీ చెకప్, వైద్యం, ముందులు అందజేయనున్నారు. ఈ పథకం పూర్తి వివరాల్లోకి వెళ్తే… వైఎస్సార్ టెలిమెడిసిన్ ఔషధాల పంపిణీ అమలు కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబరు 14410ను ఏర్పాటు చేశారు.
ఈ టోల్ ఫ్రీ నెంబర్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు 286 మంది వైద్యులతో పాటు మరో 114 మంది ఎగ్జిక్యూటివ్స్ ముందుకు వచ్చారని ఏపీ గవర్నమెంట్ తెలిపింది. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ టోల్ ఫ్రీ నెంబర్‌లో వారంతా అందుబాటులో ఉంటారని ప్రకటించింది. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో కరోనా కేసులను గుర్తించి, బాధితులను ఐసొలేషన్‌కు తరలిస్తారు. ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్ ద్వారా వైద్యుల సూచనలు తీసుకోవచ్చు.
కాగా, 14410 టోల్ ఫ్రీ నంబరుకు రోగులు మిస్డ్ కాల్ ఇస్తే అక్కడి సిస్టమ్ ఆ మొబైల్ నంబరును, మొత్తం వివరాలను నమోదు చేసుకుంటుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఆ తరువాత ఆరోగికి ఒక గుర్తింపు సంఖ్యను కేటాయించి, రోగుల జబ్బు లక్షణాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే ఆసుపత్రికి పంపించే ఏర్పాట్లు చేస్తారని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవసరమైన ఔషథాలను ప్రత్యేకంగా ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, గ్రామ వార్డు వాలంటీర్లు నేరుగా ఇంటికే తీసుకొచ్చి ఇస్తారని ప్రభుత్వం ప్రకటించింది.
tags: doctor ysr telemedicine, ap government, telemedicine, toll free number, 14410