- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూట్యూబ్ టిప్స్..
దిశ, వెబ్‌డెస్క్ :
స్మార్ట్ మొబైల్ వాడే ప్రతి ఒక్కరికీ యూట్యూబ్ గురించి తెలిసే ఉంటుంది. అంతరిక్షానికి ఎలా వెళ్లాలనే సంగతుల నుంచి కాలిలో ముల్లు గుచ్చుకుంటే ఎలా తీయాలనే టిప్స్ వరకు.. సీరియస్ విషయాల నుంచి సిల్లీ థింగ్స్ వరకు అన్నింటికి సంబంధించిన వీడియోలను నెటిజన్లు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుంటారు. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు యూట్యూబ్‌ను తెగ వాడేస్తుంటాం. కానీ అసలు విషయమేంటంటే చాలామందికి యూట్యూబ్‌లోని కొన్ని ఫీచర్స్ గురించి తెలియదు.
యూట్యూబ్.. ఎప్పటినుంచో పాపులర్ వెబ్‌సైట్‌గా లక్షలాది నెటిజన్ల ఆదరణను పొందింది. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో.. ప్రస్తుతం యూట్యూబ్ మరింత పాపులారిటీని పెంచుకుంది. లాక్‌డౌన్‌లో డేటా వినియోగం అధికమవడంతో దాన్ని కంట్రోల్ చేయడానికి.. యూట్యూబ్ స్ట్రీమింగ్ క్వాలిటీ తగ్గించినా యూజర్ల సంఖ్య పెరిగిందే కానీ తగ్గలేదని కంపెనీ తెలిపింది. మరి అంతకంతకూ పెరుగుతున్న యూట్యూబ్ యూజర్లు.. ఈ టిప్స్ పాటిస్తే వీడియో ఎక్స్‌పీరియన్స్ మరింత బాగుంటుంది.
ఇన్‌కాగ్నిటో మోడ్..
యూట్యూబ్‌లో మన మూడ్‌ని బట్టి వివిధ రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. ఇంట్లో చిన్న పిల్లలుంటే.. వారి కోసం రైమ్స్ పెడతాం. కార్టూన్ కథలు చూపిస్తాం. జంతువుల అరుపులు వినిపిస్తాం. అయితే మరోసారి యూట్యూబ్ ఓపెన్ చేయగానే మన ‘సెర్చ్’ చేసిన డేటా ప్రకారం వాటికి సంబంధించిన రికమెండేషన్ వీడియోలు కనిపిస్తుంటాయి. అలా రావొద్దని అనుకుంటే.. ఇన్‌కాగ్నిటో మోడ్ ఆన్ చేస్తే సరి. ఇందుకోసం రైట్ కార్నర్‌లో ఉన్న ప్రొఫైల్ పిక్చర్‌పై ట్యాప్ చేసి ‘టర్న్ ఆన్ ఇన్‌కాగ్నిటో మోడ్’పై క్లిక్ చేయాలి.
లిమిట్ యూట్యూబ్ యూసేజ్..
మొబైల్ నెట్ యూజర్లు దాదాపు డైలీ 1జీబీ లేదా 2జీబీ ప్యాక్‌లు వేసుకుంటారు. అలాంటప్పుడు హెచ్‌డీ వీడియోలు చూస్తే.. డేటా ఈజీగా అయిపోతోంది. అందువల్ల మొబైల్ డేటా ఆన్ ఉన్నప్పుడు డేటా యూసేజ్ లిమిట్‌గా ఉండాలంటే.. ‘లిమిట్ మొబైల్ డేటా’ టూల్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. అందుకోసం .. సెట్టింగ్ – జనరల్ – క్లిక్ ఆన్ ‘మొబైల్ డేటా యూసేజ్. ఇలా చేస్తే.. వైఫైకి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే.. హెచ్‌డీ వీడియోలు ప్లే అవుతాయి.
డబుల్ ట్యాప్ టూ సీక్..
యూట్యూబ్‌లో ఏదైనా సినిమా లేదా సీన్ చూస్తున్నప్పుడు ఆ వీడియోను స్కిప్ లేదా బ్యాక్ చేయడానికి స్క్రీన్‌కు లెఫ్ట్ లేదా రైట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తూ ఉంటాం. దాదాపు అది ‘10’సెకన్ల ముందుకు లేదా వెనక్కు వెళుతుంది. ఈ టైమ్‌ను కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకోసం.. ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేసి.. సెట్టింగ్స్ – జనరల్ – డబుల్ ట్యాప్ టూ సీక్ అనే దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది. అప్పుడు 5, 10, 15, 20, 30, 60 సెకన్ల టైమర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
ఎగ్జాక్ట్‌గా అక్కడి నుంచే వీడియో..
ఫలానా సినిమా లేదా ఏదైనా ‘షో’ లోని ఓ డైలాగ్ లేదా సీన్ మనకు బాగా నచ్చుతుంది. కానీ ఎగ్జాక్ట్‌గా అక్కడి నుంచే సీన్ మొదలయ్యే వీడియో కావాలంటే.. దొరుకుతుందా? లేదు కదా? అందుకే ఆ వీడియో ‘యూఆర్‌ఎల్’ కాపీ చేసి దాన్ని మన స్నేహితులకు పంపిస్తాం. మనం చెప్పాలనుకున్న ఆ డైలాగ్ వరకు ఆ యూజర్ వెయిట్ చెయ్యొచ్చు లేదా ఇదేం సోదిరా అనుకుని క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకే.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. మీరు అనుకున్న చోటి నుంచే వీడియో ప్లే అవుతుంది. ఉదాహరణకు.. ఓ వీడియో రెండు నిముషాలు ఉంది. అందులో 45వ సెకన్‌లో మీరు పంపిచాలనుకున్న కంటెంట్ ఉంది అనుకుంటే.. మొదట యూఆర్ఎల్ కాపీ చేసి, దానికి చివరలో.. ‘‘&t=45s’’ అని టైప్ చేసి సెండ్ చేయండి. అంతే.. అదే 1 నిముషం 45 సెకన్లకు ఉంటే.. ‘‘&t=1m45s’’ అని టైప్ చేయాలి అంతే.
క్లియర్ హిస్టరీ..
మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం. కానీ అవన్నీ మరోసారి చూడాల్సిన అవసరం లేకపోవచ్చు లేదా ఆ హిస్టరీని వేరే ఎవరూ చూడకూడదని అనుకుంటాం. అలాంటప్పుడు.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి, హిస్టరీ అండ్ ప్రైవసీ – క్లియర్ వాచ్ హిస్టరీ అనే దానిపై ట్యాప్ చేస్తే సరిపోతుంది. అదే విధంగా క్లియర్ సెర్చ్ హిస్టరీపై క్లిక్ చేస్తే.. అదంతా ఎరేస్ అయిపోతుంది.