- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూట్యూబ్ వీడియోలు డిలీట్?
దిశ, వెబ్‌డెస్క్:
గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య మూడు నెలల కాలంలో తమ వెబ్‌సైట్‌లో ఉన్న వీడియోలను పెద్దమొత్తంలో యూట్యూబ్ తొలగించింది. ఇటీవల విడుదల చేసిన గూగుల్ ట్రాన్స్‌పరెన్సీ నివేదికలో ఈ విషయం తెలిసింది. వివిధ కారణాల వల్ల 58 లక్షలకు పైగా వీడియోలను యూట్యూబ్ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. వీటిలో ఎక్కువగా అమెరికాకు చెందిన వీడియోలు ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉంది. అమెరికా నుంచి 11 లక్షల వీడియోలను, భారత్ నుంచి 7.5 లక్షల వీడియోలను యూట్యూబ్ డిలీట్ చేసింది. ట్రస్టెడ్ ఫ్లాగర్స్ అని పిలిచే వ్యక్తిగత యూట్యూబ్ వినియోగదారులు దాదాపు కోటి వీడియోలను రిపోర్ట్ చేశారు. వాటిలో ఎక్కువ వీడియోలకు ఇండియా నుంచే రిపోర్టులు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా, అమెరికా, బ్రెజిల్ నుంచి రిపోర్టులు వచ్చాయి.
కారణాలివే..
ఇంత పెద్దమొత్తంలో వీడియోలను డిలీట్ చేయడానికి గల కారణాలను కూడా గూగుల్ నివేదికలో ప్రస్తావించింది. మొత్తం వీడియోల్లో 52 శాతం స్పామ్, మిస్‌లీడింగ్ కాగా 16 శాతం చైల్డ్ సేఫ్టీ ఇష్యూస్, 14 శాతం న్యూడిటీ లేదా సెక్సువల్ కాంటెంట్, 10 శాతం వయొలెంట్ లేదా గ్రాఫికల్ కంటెంట్ ఉన్నట్లు వెల్లడించింది. వీడియోలతో పాటు అదే కాలంలో కొన్ని ఛానళ్లను కూడా యూట్యూబ్ తొలగించింది. దాదాపు 20 లక్షల ఛానళ్లను డిలీట్ చేసింది. వీటిలో 89 శాతం స్పామ్, మిస్‌లీడింగ్ కంటెంట్ గురించి ఉన్న ఛానళ్లేనని యూట్యూబ్ స్పష్టం చేసింది. అంతేకాకుండా అసభ్యంగా, ఇబ్బందిని కలిగించే 54 కోట్ల కామెంట్లను కూడా యూట్యూబ్ తొలగించినట్లు నివేదిక పేర్కొంది.