- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విలేకరిపై దాడి.. తగలబెడతామని బెదిరింపు
దిశ, ఏపీ బ్యూరో: ఓ బాధితుడిచ్చిన సమాచారంతో కవరేజీకి వెళ్లిన పాత్రికేయునిపై అనంతపురం మైకేర్ఆస్పత్రి యాజమాన్యం రౌడీలతో దాడి చేయించింది. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఓ పాత గృహంలో కోవిడ్ కేర్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. సరైన డ్రైనేజీ వసతీ లేదు. ఇవన్నీ వీడియో తీసిన రాజ్ న్యూస్ ప్రతినిధి సాయి ప్రసాద్సంబంధిత వైద్యుడి వివరణ తీసుకునేందుకు వేచి ఉన్నాడు. ఇంతలో పది మంది దుండగులు ఆస్పత్రిలో చొరబడి ప్రసాద్‌ను అసభ్య పదజాలంతో తిడుతూ దాడికి పాల్పడ్డారు. మొబైల్లాక్కున్నారు. మీడియా ఐతే ఏం చేస్తారంటూ.. స్టార్ అనంత చానల్ తమదేనంటూ.. డీఎస్పీ తమకు తెలుసంటూ పాత్రికేయుడ్ని వెంబడించారు. బైక్ ను కిందపడేసి ధ్వంసం చేశారు. ఆస్పత్రి దుర్మార్గంపై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే అది తమ పరిధిలోది కాదని మొహం చాటేశారు.
చిత్తూరు జిల్లాలో ఏకంగా విలేకరి ఇంటిపై దాడి
చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరులో ఓ విలేకరి ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఇంట్లో సామాను బయట పడేసి ధ్వంసం చేశారు. తమకు అనుకూలంగా వార్త రాయలేదనే సాకుతో పెట్రోలు పోసి తగలబెడతామని బెదిరించారు. ఇదంతా వీడియో తీసిన సదరు విలేకరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.