- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాహబంధంలో అసంతృప్తి.. ఇల్లీగల్ రిలేషన్‌షిప్ వైపు అడుగులు..
దిశ, ఫీచర్స్ : హిందూ సాంప్రదాయంలో కళ్యాణం ఒక వైభోగం. కానీ పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగింది అనే దానికంటే దంపతులు ఎంత అన్యోన్యంగా ఉన్నారనేది ఇంపార్టెంట్. అలాలేనప్పుడు నూరేళ్లు ఆ బంధాన్ని కొనసాగించడం కంటే మరో పార్ట్‌నర్‌ను ఎంచుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవడమే బెస్ట్. ప్రస్తుతం ఇండియాలోనూ యంగ్ జనరేషన్ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నా.. పల్లెల్లో మాత్రం దీన్ని పెద్దతప్పుగా పరిగణిస్తుంటారు. అందుకే అలాంటి తప్పుచేసి పదిమందిలో నవ్వులపాలు అయ్యే బదులు రహస్యబంధాన్ని కొనసాగించేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కానీ భర్త/భార్యకు ఇలాంటి సంబంధాల గురించి తెలిస్తే.. హత్య లేదా ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. ఇంతకీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టం తీసుకున్న నిర్ణయమేంటి? సెక్షన్ 497 ఏం చెబుతోంది.
ఇల్లీగల్ రిలేషన్‌షిప్ అనేది ఏ ఒక్క సమాజానికో, సంస్థకో లేదా ప్రాంతానికో పరిమితం కాలేదు. ప్రపంచ దేశాలన్నీ ఈ ఇల్లీగల్ ఎఫైర్స్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుండగా.. ముఖ్యంగా మన దేశంలో ప్రతిరోజూ 400వందలకు పైగా కేసులు బయటపడితే, తెలుగు రాష్ట్రాల్లో రోజుకు కనీసం 15 మంది హత్య, ఆత్మహత్యల పాలవుతున్నారని సర్వేలు వెల్లడించాయి. ఈ మేరకు ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సమాజాన్ని ఎదిరించి కొందరు బహిరంగంగా అక్రమ సంబంధాలు కొనసాగిస్తుంటే, ఇంకొందరు రహస్య బంధాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. చట్టపరంగా ఏకకాలంలో ఇద్దరు వ్యక్తులతో సంబంధం అనేది తప్పే అయినా ఎంతమంది ఈ నీతి సూత్రాన్ని పాటిస్తున్నారు? అనేది ఇక్కడ ప్రశ్న. సమాజం ఆమోదించిన భర్త లేదా భార్య దగ్గర సుఖం, ఆనందాన్ని పొందలేకే ఈ దారి ఎంచుకున్నామనేది వారి కారణమైనా… కామవాంఛలో కూరుకుపోయి కట్టుకున్న వారికి అన్యాయం చేయడం వల్ల భర్త లేదా భార్య.. ఈ ద్రోహాన్ని తట్టుకోలేక హత్య లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
పురుషుల అభ్యంతరం..
ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలే ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని సమాజం, చట్టాలు భావిస్తుండగా.. వివాహేతర సంబంధంలో ఇద్దరి మధ్య పరస్పర అంగీకారం ఏర్పడినపుడు కేవలం ఒక్కరికే శిక్ష విధించడం ఏ మేరకు న్యాయమంటూ పలువురు పురుషులు సెక్షన్ 497చట్టంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పురుషుడు మరో వివాహిత అనుమతితో శారీరక సంబంధం పెట్టుకుంటే.. దీనిపై ఆమె భర్త ఫిర్యాదు చేస్తే, ఈ చట్టం కింద ఆ పురుషుడిని దోషిగా పరిగణించి అతనికి ఐదేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా ఒక్కోసారి రెండు శిక్షలూ విధించవచ్చు. కానీ ఈ చట్టం ప్రకారం ఒక వివాహితుడు అవివాహిత లేదా వితంతువుతో శారీరక సంబంధం ఏర్పరచుకుంటే మాత్రం దానిని నేరంగా పరిగణించరు. దీని వల్ల ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కూడా అక్రమ ఆకర్షణలో సులువుగా పడిపోతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు ‘అనుభవించు రాజా!’ అంటూ ఏకకాలంలోనే లెక్కకు మించి సంబంధాలు పెట్టుకుంటున్నారు.
మహిళల వాదన..
దురదృష్టవశాత్తు వివాహబంధంలో సుఖానికి నోచుకోలేక బయట ప్రేమను అన్వేషించే మహిళలకు వివాహిత జీవితంలో చాలా నష్టం జరుగుతోంది. ఇష్టపూర్వక శృంగారమనేది మహిళ హక్కు.. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి షరతులు పెట్టేందుకు వీలు లేదు. ఇక పవిత్రత మాటకొస్తే అది కేవలం భార్యకే కాదు, భర్తకూ వర్తిస్తుందని ఇప్పటికే సుప్రీం కోర్టు చెప్పినా.. దీన్ని సమాజం ఎందుకు ఆమోదించడం లేదని వాదిస్తున్నారు. పురుషులు అవివాహిత, వితంతువుతో సంబంధం పెట్టుకున్నప్పుడు రసికుడని మెచ్చుకుంటున్న సమాజం.. అదే పరిస్థితిలో మహిళ ఉంటే మాత్రం ఎందుకు వెలివేస్తుందని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇలాంటి కేసులు 1954, 1985, 1988లో కూడా విచారణకు వచ్చాయి కూడా.
చట్టం ఏం చెబుతోంది.?
వివాహేతర సంబంధాల చట్టంలో సవరణలు చేస్తే దాని వల్ల వైవాహిక వ్యవస్థ పవిత్రత దెబ్బతింటుందని ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ సమాజంపై దుష్ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడింది. కానీ వివాహితులు ఇష్టపూర్వకంగా సంబంధం పెట్టుకుంటే అది నేరం కాదని పేర్కొంది న్యాయస్థానం. భార్యను భర్త ఆస్తిగా భావించడమనేది మహిళల హక్కులను కాలరాయడమేనని, అది కాలం చెల్లిన భావన అని స్పష్టం చేసింది. వేరొకరితో ఇష్టపూర్వకంగా సంబంధం పెట్టుకోవాలని అనుకుంటే విడాకులు తీసుకుంటే మంచిదని సూచించింది. ఈ చట్టం వల్ల మహిళల సమానత్వానికి భంగం వాటిల్లుతుందని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా వెల్లడించగా.. మగవాళ్లు ఇక మోసగాళ్లు కాదు, మహిళలు బాధితులూ కాకుండా ఉండిపోతారని తెలిపారు.
మూణ్నాళ్ల ముచ్చటేనా..
హిందూ సాంప్రదాయం ప్రకారం ధర్మార్ధ కామమోక్షాలు అనే నాలుగు పురుషార్ధాలలో ఒకటైన కామాన్ని ధర్మబద్ధం చేసేందుకు పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ఆలుమగలంటే రెండు శరీరాలు ఒకే ప్రాణంగా మనుగడ సాగిస్తూ తమ మనసులో ఇతరులకు చోటివ్వకుండా జీవించడం.. మరొకరు వీరి దాంపత్య జీవితంలోకి చొరబడకుండ బ్రహ్మముడి వేయడం.. కానీ నేటి తరంలో పెళ్లైన మూన్నాళ్లకే మూడుముళ్లు తెగిపోతున్నాయి. కారణం ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకోకపోగా.. బాధ్యతలు, పని ఒత్తిడి, ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ జీవితాన్ని అసంతృప్తిగా గడుపుతున్నారు. ఈ క్రమంలో స్నేహితులతో మరింత సాన్నిహిత్యం పెంచుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన ఫ్రెండ్స్ ఓదార్చుతున్నట్లుగా నటిస్తూ ఉద్యోగ, ఉపాధి అవసరాలు అనే బలహీనతలో క్రమంగా అక్రమ సంబంధానికి దారులేస్తున్నారు. ఈ అసహజ సంబంధాలే పరోక్షంగా హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, కక్షలకు దారితీస్తున్నాయి.