TG Assembly: అసెంబ్లీలో బీజేపీ వాయిదా తీర్మానం.. ఆ అంశంపై చర్చకు పట్టు

by Shiva |   ( Updated:2025-03-17 03:49:03.0  )
TG Assembly: అసెంబ్లీలో బీజేపీ వాయిదా తీర్మానం.. ఆ అంశంపై చర్చకు పట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కానున్నాయి. గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శనివారం సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రైతు రుణమాఫీతో పాటు గృహజ్యోతి పథకాలపై సభ దద్దరిల్లింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రసంగిస్తుండగానే.. బీఆర్ఎస్ (BRS) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే, నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాల (Assembly Session) ముందు బీజేపీ (BJP) నాయకులు వాయిదా తీర్మానం (Adjournment Resolution) ఇచ్చారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు (Six Guarantees) అమలు అవుతోన్న తీరు.. ఆరు గ్యారంటీల చట్టబద్ధతపై సభలో చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇవాళ సభలో ఆ అంశంపై బీజేపీ సభ్యులు చర్చకు పట్టుబట్టనున్నారు.

నేడు సభ ముందుకు కీలక బిల్లులు..

కాగా, అసెంబ్లీలో ప్రభుత్వం రెండు చారిత్రాత్మక బిల్లులను ప్రవేశ పెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ (Classification of SC), బీసీ రిజర్వేషన్ (BC Reservation) బిల్లులతో పాటు మొత్తం ఐదు బిల్లులను సర్కార్ సభ ముందుకు తీసుకురానుంది. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ప్రారంభం కానుండగా.. అనంతరం ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లును సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రవేశపెట్టనున్నారు. ఆ వెంటనే బీసీ రిజర్వేషన్ బిల్లు, బీసీలకు అర్బన్ అండ్ లోకల్ బాడీలో రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) శాసన‌సభలో ప్రవేశ పెడతారు ఈ బిల్లుల ద్వారా బీసీలకు విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంతో పాటు, అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనున్నారు.

Next Story

Most Viewed