మహబూబ్‌నగర్‌లో కరోనా నివారణ చర్యలు

by Shyam |   ( Updated:2020-03-24 04:55:12.0  )
మహబూబ్‌నగర్‌లో కరోనా నివారణ చర్యలు
X

దిశ, మహబూబ్ నగర్: యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను నియంత్రించేందుకు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా యువత సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో యువత రోడ్లను దిగ్బంధనం చేశారు. గ్రామాల్లోకి బయటి వారు ఎవరు లోపలికి రానివ్వకుండా, లోపలి వారు ఎవరు బయటకు పోకుండా సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. అలాగే గ్రామాల్లో ఉండే షాపుల వద్ద కూడా ప్రజలు గుంపులుగా ఉండాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షాపులకు వచ్చే వారు కూడా ఒకే సారి వెళ్లకుండా నియంత్రించేందుకు తగు చర్యలు తీసుకున్నారు. మనిషికి మనిషికి మధ్యలో దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. అలాగే గ్రామాల్లోకి వచ్చిన ఇతర ప్రాంతాలకు చెందిన వారిని గుర్తించి ఆరోగ్య శాఖాధికారులకు సమాచారం ఇచ్చి వారిని పరీక్షలకు తరలిస్తున్నారు.

ప్రధాన నగరాల్లో కూడా అని ప్రధాన రహదారులను పోలీసులు దిగ్బంధించారు. వారికి స్థానిక యువకులు సహకరిస్తున్నారు. అలాగే పలు కాలోనిలోకి ఎవరు రాకుండా ప్రజలే వివిధ రకాల వస్తువులను అడ్డుగా వేసి వారు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అదే విధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని జోగులాంబ అమ్మవారి ఆలయంలో మంగళవారం నాడు మృత్యుంజయ హోమం నిర్వహించారు. జిల్లాలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు జిల్లా కలెక్టర్లు సైతం రోడ్లపైకి వచ్చారు. ఇష్టానుసారంగా పనులు లేకున్నా రోడ్లపైకి వచ్చిన పలువురు వ్యక్తుల పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కొంత బాధ్యతగా వ్యవహరించాలని అప్పుడే దీని నియంత్రణ సాధ్యం అవుతుందని వివరించారు. సాయంత్రం 7 తరువాత ఎవరు బయటకు వచ్చిన కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అలాగే ఇప్పటికే జిలాలో మంగళవారం నాడు మధ్యాహ్నం వరకు సుమారు 83 వాహనాలను సీజ్ చేసినట్లు సమాచారం.

పోలీసు సిబ్బందికి మంచినీరు మరియు భోజనం పంపిణీ:
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఏక్తా గ్రూప్ స్వచ్ఛంద సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలు రోడ్లపైకి రాకుండా, ఎండలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులకు నీరు మరియు భోజనం అందజేసి తమ దయాగుణాన్ని, సేవాతత్వాన్ని చాటుకున్నారు. ప్రజలంతా చల్లగా ఉండాలనె ఒక్క అభిమతం తప్ప తమకు ఏ స్వార్థ ఆలోచన ఉండకూడదని వారు ఈ సందర్భంగా అన్నారు.

Tags: Youth, collector, police, Prevention Measures, Corona, mahabubnagar

Advertisement

Next Story

Most Viewed