- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ అరెస్టులతో ముట్టడిని ఆపలేరు
దిశ, వనపర్తి:తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కు బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్బంగా వనపర్తి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట్ల రవి మాట్లాడుతూ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిరుద్యోగ భృతి కి నిధులు కేటాయించలేకపోవడం పై రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి రాష్ట్రంలోని 20 లక్షల మంది ఉద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ బయదేరగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకొని అక్రమ అరెస్టులు చేయడం ఖండిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ భృతి కి నిధులు కేటాయించి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఆపలేరనీ అన్నారు.అరెస్ట్అయిన వారిలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దివాకర్, యాదవ్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాబా,వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్,కౌన్సిలర్ బండారు రాధా కృష్ణ, మన్యంకొండ,విజయ్,దిలీప్ యాదవ్,రఘుపతి ఉన్నారు.