- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్‌కు దమ్ముంటే ముందు ఆ పని చేయాలి.. యూత్ కాంగ్రెస్ సవాల్
దిశ, మణుగూరు: ప్రజలను మోసం చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించినది మరోటి లేదని, చీటింగ్‌లో భాగంగానే హుజూరాబాద్‌లో ‘దళితబంధు’ పథకం తీసుకొచ్చారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నేతలు విమర్శించారు. శనివారం పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్డులో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేపట్టిన ‘దళిత గిరిజన దండోరా’ సభకు మద్దతుగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో ‘సత్యాగ్రహదీక్ష’ను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి, పోడు రైతులకు పట్టాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ చేతగాని హామీలు ఇచ్చి, కాలయాపన చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు ముందే రాష్ట్రవ్యాప్తంగా ‘దళితబంధు’ అమలు చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేసి నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. రాజీనామా చేస్తేనే ఆయా నియోజకవర్గాలకు కొత్త పథకాలు రావడంతో పాటు ‘దళితబంధు’ వంటివి వెంటనే అమలు అవుతాయని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా యువతీ, యువకులను ప్రభుత్వం రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ దీక్షలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గురిజాల వెంకట్, పినపాక నియోజకవర్గ అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ చందా సంతోష్, పార్టీ పినపాక మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం, కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, గుండాల మండల అధ్యక్షులు ముత్యమాచారి, గుండాల మండల యూత్ ప్రెసిడెంట్ దుర్గ, ఎంపీటీసీ కృష్ణ, ఎమ్మార్పీఎస్ జిల్లా జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ అచ్చా నవీన్, పినపాక నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ మిట్టపల్లి నితిన్ కుమార్, కరకగూడెం యూత్ ప్రెసిడెంట్ సాగర్, రహీమ్ ఖాన్, రసమళ్ళ నాగరాజు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.