పేద‌ల‌కు అండ‌గా యువ‌జ‌న కాంగ్రెస్‌

by Shyam |
abdullapurmet youth congress
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ జ‌న్మదిన వేడుక‌ల‌ను కాంగ్రెస్ నేత‌లు నిరాడంబ‌రంగా జ‌రుపుకొన్నారు. ఇబ్రహీంప‌ట్నం యువ‌జ‌న కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్రం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఆలేటి ఆటం అనాథ ఆశ్రమంలో భోజ‌నం, పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి ఆదేశాల మేర‌కు సేవా కార్యక్రమాలు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. నిరుపేద‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుర్ర రేఖ‌ మహేందర్ గౌడ్, పెద్ద అంబ‌ర్‌పేట వైస్ చైర్ ప‌ర్స‌న్ చామ సంపూర్ణ విజ‌య‌శేఖ‌ర్‌రెడ్డి, కౌన్సిల‌ర్లు సుజాత కిష‌న్‌, గీత, శ్రీ‌రాములు, కాంగ్రెస్ నేత‌లు రవికాంత్ గౌడ్, గణేష్ రెడ్డి, బాలశివుడు గౌడ్, అనుకిరణ్ రెడ్డి, నితిన్, బొడుసుశేఖర్, ప్రణీత్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తుర్కయంజాల్‌లో…

రాహుల్‌గాంధీ జ‌న్మదినం సంద‌ర్భంగా తుర్కయంజాల్‌లో కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగ‌మ్మ శివ‌కుమార్ ఆధ్వర్యంలో పేద‌ల‌కు నిత్యావ‌స‌రాలు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ రాహుల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పేద‌ల‌కు స‌హాయం చేయ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. ప్రజ‌ల‌కు సేవ చేసేందుకు నిరంత‌రం ముందుంటామ‌ని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిల‌ర్ మేత‌రి అనురాధ ద‌ర్శన్‌, కాంగ్రెస్ నేత గుడ్ల అర్జున్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed