- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లైండ్ డేటింగ్.. లైఫ్ పార్టనర్ సెలెక్షన్‌లో యూత్ ‘డిఫరెంట్ వే’
దిశ, ఫీచర్స్: ఒక వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకోవడం అంటే భవిష్యత్తును ఎంచుకోవడమే. మన ఫ్యూచర్ పార్టనర్‌పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే జీవితాంతం తోడుండబోయే వ్యక్తిలో మనకు నచ్చిన క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటాం. కానీ పెద్దలు ఇవేవీ ఆలోచించకుండా ఓ మ్యాచ్ తీసుకొచ్చామా? పెళ్లి చేశామా? బాధ్యత తీర్చుకున్నామా? అన్నట్లుగా ఉంటారు. కానీ ప్రస్తుత యంగ్ జనరేషన్.. తల్లిదండ్రులో లేక పెద్దవాళ్లు చెప్పిన మాటలో పట్టించుకుని ఇష్టంలేని పార్టనర్‌తో జీవితాంతం ఉండేందుకు అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకే ‘బ్లైండ్ డేటింగ్’ను ఫాలో అవుతున్నారు. తను పెళ్లి చేసుకునే వ్యక్తి గురించి ముందుగానే తెలుసుకుని.. ఆ తర్వాత మ్యారేజ్‌కు సిద్ధం అవుతున్నారు.
‘బ్లైండ్ డేట్’లో పాల్గొనే ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు సంబంధం లేకుండానే ఉంటారు. అంతకుముందు ఎలాంటి పరిచయంలేని ఒక అమ్మాయి, అబ్బాయిని ఓ మధ్యవర్తి కలుపుతాడు. ఇదే వారి ఫస్ట్ డేట్ కాబట్టి ఒకరి గురించి ఒకరు తెలుసుకునేందుకు సాధారణంగా రెండు గంటలు లేక అంతకంటే తక్కువ సమయం కేటాయిస్తుంటారు. ఇదే వివాహానికి పునాది వేస్తుందా? లేదా? అనేది నిర్ణయిస్తుంది. కాగా కొన్నిసార్లు డేటింగ్‌లో పాల్గొనే వ్యక్తికి మరొకరిపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఈ మ్యాచ్ సెట్ చేసే వ్యక్తి అయోమయంలో పడిపోతాడు. డేట్ సెట్ చేయాలా? వద్దా? అనే టెన్షన్‌లో ఉండిపోతాడు. ‘బ్లైండ్ డేట్’ అనేది ఒక అడ్వెంచరస్ పార్ట్ కాగా పబ్లిక్ ప్లేస్‌లలో మీటింగ్ అరేంజ్ చేస్తుంటారు.
అయితే 60 ఏళ్లుగా డేటింగ్ మార్కెట్‌పై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ప్రభావం తగ్గిపోయింది. 15 ఏళ్లుగా ఇంటర్నెట్ వేగంగా విస్తరించడంతో యూత్ ఆన్‌లైన్ డేటింగ్ వైపు మొగ్గుచూపుతోంది. నైబర్ హుడ్, వర్క్ ప్లేస్, ఫ్రెండ్స్ సర్కిల్‌లోనే డేటింగ్ పార్ట్‌నర్స్‌ను ఎంచుకుంటున్నారు. 2013 మే నాటికే 11శాతం మంది అమెరికన్ యూత్ డేటింగ్ సైట్స్, డేటింగ్ యాప్స్ వైపు మొగ్గుచూపగా.. చైనా అతిపెద్ద ఆన్‌లైన్ డేటింగ్ సైట్ 100 మిలియన్ పైగా యూజర్స్‌ను కలిగి ఉన్నట్లు నివేదించింది. అయితే ఆన్‌లైన్ వర్సెస్ రియల్ డేట్.. ఏడాదికి పైగా కలిసి ఉన్న జంటలపై చాలా ప్రభావం చూపిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆన్‌లైన్ డేటింగ్‌లో దాదాపు 17శాతం పెరుగుదల కనిపించిందని.. డేటింగ్ చేసిన ఆరు జంటల్లో ఒక జంట పెళ్లి చేసుకుంటే, ఫస్ట్ డేట్‌కు ఓకే చెప్పిన ఐదు జంటల్లో ఒకరు డేటింగ్‌కు ఎస్ చెప్పారని ఓ పాపులర్ డేటింగ్ వెబ్‌సైట్ ప్రచురించింది.
‘బ్లైండ్ డేటింగ్’ ఇన్ అదర్ కంట్రీస్..
చైనాలో ‘బ్లైండ్ డేటింగ్’ అనేది పార్టనర్స్ మధ్య కాకుండా పేరెంట్స్ ఇనిషియేటివ్‌తో మొదలవుతుంది. తమ పిల్లలకు జంటను వెతికేందుకు ఫొటో అండ్ డీటెయిల్స్‌తో ఓ పార్క్‌లో కూర్చుని వెయిట్ చేస్తుంటారు. ఈ క్రమంలో మరో పేరెంట్ ఈ డీటెయిల్స్‌కు ఇంప్రెస్ అయితే.. సెకండ్ స్టేజ్‌కు వెళ్తుంది. రెండు వైపులా పేరెంట్స్ ఓకే అనుకున్నాక పిల్లల దగ్గరికి వెళ్లేసరికి నో చెప్పిన సందర్భాలు కూడా ఎక్కువే. అందుకే అక్కడ ‘బ్లైండ్ డేటింగ్’ అనేది పార్టనర్‌ను ఎంపిక చేసుకోవడంలో డిఫికల్ట్‌గా ఉంటుంది.
ఇక సౌత్ కొరియాలో బ్లైండ్ డేటింగ్ రెండు విధాలుగా ఉంటుంది. మీటింగ్ అండ్ సొగేటింగ్. మీటింగ్ బ్లైండ్ డేట్స్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా యూనిర్సిటీ విద్యార్థులు గ్రూప్‌గా మీట్ అవుతుంటారు. ఇక సొగేటింగ్ డేట్‌లో ఇద్దరు సింగిల్స్ పాల్గొంటుంటారు. ఇందులో మీటింగ్ కంటే తక్కువ ఆల్కహాల్ ఉపయోగిస్తుంటారట.
యూట్యూబ్ ‘బ్లైండ్ డేట్’
నేపాల్ రియాలిటీ షో ‘బ్లైండ్ డేట్’ యూట్యూబ్‌లో రికార్డ్ప్ క్రియేట్ చేస్తోంది. ఫిబ్రవరి 14 నుంచి ప్రసారమవుతున్న షో ఇప్పటికే వైరల్ కాగా.. షో కంటెంట్ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆర్డినరీ పీపుల్‌తో చేసిన ఈ షోలో.. ప్రతీ వారం ఐదుగురు అపరిచిత జంటలను కలుపుతుంటారు మేకర్స్. వారి ఇంట్రెస్ట్స్, లైక్స్ షేర్ చేసుకునే క్రమంలో వారిమధ్య జరిగే ఫైట్స్, ప్రాబ్లమెటిక్ థింగ్స్‌ను ప్రజెంట్ చేస్తుంటారు. ఇప్పటికే 26 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షోలో ప్రతీ ఎపిసోడ్ కూడా రెండు లక్షల వ్యూస్ సొంతం చేసుకుని బిగ్ సక్సెస్ సాధించింది.