నకిలీ హాల్ టికెట్‌తో ప‌రీక్ష…యువతి అరెస్ట్

by Sumithra |   ( Updated:2021-01-08 09:10:43.0  )
నకిలీ హాల్ టికెట్‌తో ప‌రీక్ష…యువతి అరెస్ట్
X

దిశ ప్ర‌తినిధి , హైద‌రాబాద్: న‌కిలీ హాల్ టికెట్‌తో యూపీపీఎస్సీ (మెయిన్స్) ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యేందుకు వ‌చ్చిన యువ‌తిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. నాంప‌ల్లిలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో నిర్వ‌హించే ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యేందుకు ఏపీలోని క‌ర్నూలు జిల్లా యువ‌తి హాల్ టికెట్ (ఈ అడ్మిట్ కార్డు) నెంబ‌ర్ 7601738 తో ప‌రీక్షా కేంద్రానికి వ‌చ్చింది.

ప‌రీక్షా కేంద్రం వ‌ద్ద అధికారులు హాల్ టికెట్ త‌నిఖీ చేయ‌గా అది న‌కిలీద‌ని తేలింది. దీంతో ప‌రీక్షా కేంద్రం ముఖ్య ప‌ర్య‌వేక్ష‌కురాలు వెంట‌నే పూర్తి స్థాయి విచార‌ణ చేప‌ట్టారు. వెంటనే జిల్లా కలెక్ట‌ర్ శ్వేతా మ‌హంతికి స‌మాచారం అందించారు. ఆమె సూచ‌న‌ల మేర‌కు యువ‌తిపై అధికారులు హ‌బీబ్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story