- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సఖి సెంటర్‌లో యువతి ఆత్మహత్య
దిశ, జనగామ : సఖి సెంటర్‌లో యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన శ్రీలేఖ(21), మనోహర్(19)లు పారిపోయి ఈ నెల 15న ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా శ్రీలేఖ ఇంటి నుంచి వెళ్లి పోయిన వెంటనే ఆమె తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వారి ఆచూకిని తెలుసుకున్నారు. అనంతరం శ్రీలేఖను కౌన్సిలింగ్ నిమిత్తం జనగామలోని సఖి సెంటర్‌కు పోలీసులు తరలించారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన శ్రీలేఖ సఖి సెంటర్‌లోని బాత్ రూంకు వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న జనగామ పోలీసులు సఖి సెంటర్‌కు చెరుకుని మృతదేహాన్ని జిల్లా దవాఖానలోని మార్చురికి తరలించారు. కేసు దర్యప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.