- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాఠశాలలో మందుబాబుల వీరంగం.. HM రూమ్‌లోకి ప్రవేశించి..
దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు ఆకతాయిలకు అడ్డాలుగా మారాయి. సోమవారం మండల పరిధిలోని ఏదులాపురం, వెంకటగిరి పాఠశాలల్లో ఆకతాయిలు హల్‌చల్ చేశారు. ఏదులాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యుయుడి రూం తలుపులు, కిచెన్ రూం తాళాలు పగులగొట్టారు. కిచెన్‌లో విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యాన్ని పారబోశారు. అనంతరం అదేరోజు రాత్రి వెంకటగిరిలోని జిల్లా పరిషత్హైస్కూల్లో మద్యం తాగి, బిర్యానీ తిని, తాగిన బీరు సీసాలు పాఠశాల ఆవరణంలో వేసి వెళ్లిపోయారు. ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఈ దృశ్యం కనిపించడంతో వారు వెంటనే ఉపాధ్యాయులకు తెలియజేశారు. ఇలాంటి సంఘటనల వలన టీచర్లతో పాటు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది తాగిన సీసాలను పాఠశాలలోనే పగులగొడుతున్నారు. ఇలాంటి ఘటనలు జరుగడం మండలంలో కొత్తేం కాదని, ఖమ్మం నరగ శివారు గ్రామాల్లో ఎక్కవగా జరుతున్నాయని స్థానికులు అంటున్నారు.
శివారు గ్రామాల్లో గంజాయి అమ్మకాలు
నాయుడుపేట, జగలంనగర్, ఏదులాపురం, పెద్దతండా, వరంగల్ క్రాస్ రోడ్డు, గుర్రాలపాడు, గుదిమళ్ల, వెంకటగిరి, మద్దులపల్లి, ముత్తగూడెం, గొల్లగూడెం గ్రామాల్లో కొత్తగా వెలుస్తోన్న వెంచర్లలో ఆకతాయిల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. బర్త్డే పార్టీల పేరుతో మద్యం సేవించడం, గంజాయి, దమ్ము లాగడం తరువాత అక్కడే బీరు బాటిళ్లు పగులగొట్టి పడేసి వెళ్లి పోవడం వంటి సంఘటలు చోటుచేసుకుంటున్నాయి. గ్రామాల్లో సాయంత్రం ఆరు గంటల నుంచే ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు ఊరు శివార్లలో ఉన్న పాడుబడిన ఇండ్లలో వెళ్లి మద్యం సేవించి, గంజాయి మత్తులో జల్సాలు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలతో పలుమార్లు ఊర్లలో గొడవలు జరిగిన ఘటనలూ ఉన్నాయి. ఇలాంటి ఆకతాయిలపై పోలీసులు నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.