సార్ బస్సులో చిల్లర మరిచిపోయాను.. సజ్జనార్‌ హెల్ప్ కోరిన ప్రయాణికుడు.. చివరకు

by Shyam |   ( Updated:2021-11-07 01:19:47.0  )
TS RTC MD Sajjanar
X

దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. ఆర్టీసీలో ఎన్నో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టారు. ఆర్టీసీ ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళ్లేందుకు పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ప్రయాణికుల సమస్యలపై దృష్టిపెట్టారు. ప్రయాణికులు, నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఏ విషయాన్ని అడిగినా ఇట్టే చెప్పేస్తున్నాడు. అంతే కాకుండా ప్రయాణికులు తమ సమస్యలను సోషల్ మీడియా వేదికగా తెలపడంతో సజ్జనార్ వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ యువకుడు బస్సులో చిల్లర మర్చిపోయానని ఏకంగా సజ్జనార్‌కు ట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన ఆయన, డిపో అధికారుల సంప్రదించి విద్యార్థికి ఫోన్ పే ద్వారా డబ్బులు అందించారు.

వివరాల్లోకి వెళ్లితే..సీతాఫల్ మండికి చెందిన లిక్కిరాజు, బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు జీడిమెట్ల బస్సు డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు ఎక్కాడు. టికెట్ కోసం కండక్టర్ కు రూ. 100 ఇవ్వగా చిల్లరలేకపోవడంతో కండెక్టర్ టికెట్ వెనుక రూ.80 ఇవ్వాలని రాశాడు. కానీ, సికింద్రాబాద్ వచ్చాక రాజు డబ్బులు తీసుకోవడం మర్చిపోయి బస్సుదిగిపోయాడు, తర్వాత చిల్లర తీసుకోలేదు అని తెలుసుకునే లోపే బస్సు వెళ్లిపోయింది. దీంతో తన జేబులో చిల్లిగవ్వకూడా లేకపోవడంతో రాజు ఇంటికి నడుచుకుంటూ వెళ్లి , సజ్జనార్‌కు విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. దీంతో వెంటనే స్పందించిన ఆయన జీడిమెట్ల డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డిని పరిశీలించాలని సూచించారు. శనివారం ఆ ప్రయాణికుడికి చెల్లించాల్సిన రూ. 80ని..డిపో మేనేజర్ ఫోన్ పే ద్వారా పంపించారు.ఈ విషయం తెలుసుకున్న..నెటిజన్లు ఆర్టీసీ ఎండీ, సంస్థపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

పెట్రో ధరలు తగ్గించండి KTR సార్.. నెటిజన్లపై TRS నేతల ఓవరాక్షన్.!

Advertisement

Next Story

Most Viewed