పాతబస్తీలో కత్తులతో యువకుడి సంచారం

by Shyam |   ( Updated:2020-05-28 10:11:10.0  )
పాతబస్తీలో కత్తులతో యువకుడి సంచారం
X

దిశ, హైదరాబాద్: రెయిన్‌బజార్ పీఎస్ పరిధిలో అబ్దుల్ అద్నాన్ అనే 20 ఏళ్ల యువకుడు కత్తులు పట్టుకొని తిరుగుతుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ యువకుడు కత్తులు పట్టుకొని తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story