బిచ్కుందలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

by Sridhar Babu |   ( Updated:2021-12-29 04:05:42.0  )
Bichkundha-1
X

దిశ, బిచ్కుంద: కామారెడ్డి బిచ్కుంద మండలం కథగామ్ నుండి కుర్లా వెళ్లే దారిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. మృతి చెందిన యువకుడిని గుండె కల్లూరు గ్రామానికి చెందిన యదుగొండ(28)గా గుర్తించారు. దీంతో మృతుని బంధువులు, గ్రామస్తులు అక్కడికి చేరుకొని భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం కూడా వాజీద్ నగర్ టిప్పర్ ఢీకొని అంకోల్ తండాకు చెందిన రూప్లనాయక్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇసుక లారీల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story