- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెల్లారితే నిశ్చితార్థం..నాకు బతకాలని లేదంటూ సూసైడ్
దిశ, ఖమ్మం :
తెల్లారితే నిశ్చితార్థం పెట్టుకుని..అంతలోనే తనకు బతకాలని లేదంటూ సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జీళ్ల చెరువు గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..లాల్ సాహెబ్(26)కు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండల కేంద్రంలోని ఓ యువతితో నిశ్చితార్థం జరగాల్సి ఉంది.ఈ క్రమంలోనే బంధువులు ఎవరికి చెప్పకుండా పాలేరు వద్ద పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.
నా వాళ్లు అందరూ చనిపోయారు..ఇక తనకు బతకాలని లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.అంతేకాకుండా తన మరణానికి ఎవరూ కారణం కాదని, తన పేరు మీద సుమారు రూ.5లక్షల వరకు అప్పులున్నాయని, అలాగే దాదాపు రూ.13లక్షలు కూడా కొంతమంది వ్యక్తుల నుంచి రావాల్సి ఉందని వారి పేర్లను కూడా నోట్ లో పొందుపరిచాడు.తనకు బాకీ ఉన్న వారి నుంచి డబ్బులు కలెక్ట్ చేసి, అప్పులు చెల్లించాలని బంధువులకు సూచించాడు. మిగిలిన మొత్తాన్ని చిన్నమ్మకు అందజేయాలని కోరాడు.
మిస్టరీగా ఆరుగురి మరణం..
లాల్ సాహెబ్ కుటుంబీకులు ఆరుగురు 17 జూలై 2017న అనుమానాస్పద స్థితిలో పాలేరులో మృతిచెందారు. మృతుల్లో అన్న సలీం, అతని భార్య రజియా, ఇద్దరు పిల్లలు హసీనా, సోని, తల్లిదండ్రులు పెంటుసాబు, మహబూబ్ ఉన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగానే వీరంతా ఆత్మహత్యలకు పాల్పడినట్లు బంధువులు చెప్పినా..వారికి ఎలాంటి అప్పులు లేవని గ్రామస్థులు చెబుతున్నారు.ఈ ఘటన జరిగి మూడేళ్లు కావొస్తున్న వారంతా ఎందుకు చనిపోయారన్నది మాత్రం మిస్టరీగానే మిగిలింది.ఈ క్రమంలోనే ఆ కుటుంబంలో మిగిలిన ఏకైక వ్యక్తి లాల్‌సాబ్ కూడా గురువారం తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడటం స్థానికులను షాక్‌కు గురిచేసింది. అప్పుడు కుటుంబ సభ్యుల చావుకు…ఇప్పుడు లాల్‌సాహెబ్ ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుందన్నది తెలియరాలేదు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.