- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. యువకుడు ఆత్మహత్యాయత్నం
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కలకలం రేపింది. నరసరావుపేట మండలం గురవాయిపాలానికి చెందిన మహేష్ బిటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం నోయిడాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇటీవలే మహేశ్ గుంటూరుకు వచ్చాడు. కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్న అతడు గోరంట్లలోని ఐడీ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న లాడ్జిలో గది తీసుకుని.. కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి తాగాడు.
అనంతరం బ్లేడ్‌తో చేయి కోసుకున్నాడు. ఇదంతా వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపాడు. అయితే గదిలో మహేశ్ కేకలు వేయడంతో లాడ్జి సిబ్బంది వచ్చి తలుపులు పగులగొట్టి మహేష్‌ను 108 ద్వారా జిజిహెచ్‌కు తరలించారు. కొంతసేపటికి అక్కడకు చేరుకున్న కుటుంబసభ్యులు అతనిని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. నల్లపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహేశ్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.