- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలాపూర్‌లో అమానుషం.. ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి
దిశ, జల్‌పల్లి: హైవేపై వెళ్తూ సడన్‌గా ఆటోను ఎడమ వైపు తిప్పినందుకు వెనుక బైక్‌మీద ఇద్దరు వ్యక్తులు గొడవకు దిగారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన ఆమేర్ కత్తితో ఆటో డ్రైవర్భుజంపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. బాలాపుర్పోలీసుల వివరాల ప్రకారం.. క్యుబా కాలనీకి చెందిన సయ్యద్అక్రమ్ వృత్తి రిత్యా ఆటో డ్రైవర్. గురువారం సయ్యద్ అక్రమ్ పాల ప్యాకెట్‌కోసం ప్యాసింజర్ఆటోలో తన పిల్లలతో కలిసి షాహిన్నగర్కు బయలుదేరాడు.
షాహిన్నగర్సమీపంలో కిరాణ దుకాణం ఎడమ వైపు ఉండడంతో సయ్యద్ అక్రమ్ సడన్‌గా ఆటోను ఎడమవైపుకు తిప్పాడు. వెనుకనే బైక్ పై ఉన్న మహ్మద్ఆమీర్, సర్పరాజ్‌లు సయ్యద్అక్రమ్పై గొడవకు దిగారు. సడన్‌గా ఆటోను ఎలా తిప్పుతావ్అంటూ ఇరువరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన మహ్మద్ఆమేర్ సయ్యద్అక్రమ్పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సయ్యద్ అక్రమ్‌కు భుజంతో పాటు తలకు గాయాలయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.