బోనాల ఉత్సవాల్లో ఫ్రెండ్‌షిప్.. మాత్రలు ఇచ్చి రేప్

by Anukaran |
బోనాల ఉత్సవాల్లో ఫ్రెండ్‌షిప్.. మాత్రలు ఇచ్చి రేప్
X

దిశ, వెబ్ డెస్క్: నగరంలో దారుణం చోటు చేసుకుంది. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న బాలికకు మాత్రలు ఇచ్చి పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. విషయం బాధితురాలి తల్లిదండ్రులకు తెలియడంతో పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలే బోనాల ఉత్సవాలు జరిగాయి. ఈ క్రమంలో రోహన్ అనే యువకుడు ఇదే ప్రాంతానికి చెందిన ఓ బాలికను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ బాలికను మచ్చిక చేసుకున్నాడు. అనంతరం బాలిక చేత బలవంతంగా మాత్రలు మింగించి పలుసార్లు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆ బాలిక భయపడుతూ తల్లిదండ్రులకు చెప్పింది. విషయం తెలిసిన వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఆ యువకుడు పరారీలో ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed