- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దానికి ఒప్పుకోలేదని యువకుడి ఘోరం.. యువతికి సెక్స్ బొమ్మలు పంపి..
దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు మహిళలపై వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ప్రేమించలేదని, పెళ్ళికి ఒప్పుకోలేదని, వేరొక అబ్బాయితో మాట్లాడుతోందని, సెక్స్ కి ఒప్పుకోలేదని.. వారిపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు ప్రేమోన్మాదులు. అయితే చంపేయడం.. లేకపోతె వారి పరువు తీయడం చేస్తున్నారు. తాజాగా పెళ్ళికి నిరాకరించిందని ఓ యువకుడు.. ప్రేమించిన అమ్మాయికి సెక్స్ బొమ్మలను పంపి వేధించాడు. అంతేకాకుండా ఆమె ఫోన్ నెంబర్ ని పోర్న్ సైట్ లో పెట్టి పరువు తీశాడు. ఈ దారుణ ఘటన ముంబై నగరంలో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. మహారాష్ట్రలోని ముంబై నగరానికి చెందిన కునాల్ అంగోల్కర్ (27) తన పొరుగింట్లోని 21 ఏళ్ల యువతిని ప్రేమించాడు. అదే విషయాన్ని ఆమెకు తెలిపాడు. ఆమె తన తల్లిదండ్రులతో మాట్లాడమని తెలపడంతో.. అతను, యువతి తల్లిదండ్రులతో పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. అయితే యువతి కుటుంబం పెళ్లి ప్రపోజల్ ని తిరస్కరించింది. దీంతో యువతిపై, ఆమె కుటుంబంపై కక్ష పెంచుకున్న కునాల్.. ఎలాగైనా ఆ ఇంటి పరువు తీయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నెలరోజుల నుంచి ఈకామర్స్ వెబ్ సైట్ ల ద్వారా యువతి ఇంటికి సెక్స్ బొమ్మలు పంపడం మొదలు పెట్టాడు. అవి చూసిన యువతి షాక్ అయ్యింది. అంతేకాకుండా ఆమె ఫోన్ నెంబర్ ని పోర్న్ వెబ్ సైట్లలలో పెట్టడంతో ఆకతాయిలు ఆమెకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ వేధించసాగారు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది.
యువతి ఫిర్యాదుమేర మలాడ్ పోలీసులు ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి ముంబై పోలీసు సైబర్ సెల్ కు బదిలీ చేశారు. కునాల్ బొమ్మలను ఆర్డర్ పెట్టిన ప్రతిసారి ఐపీ అడ్రెస్స్ మార్చడంతో పోలీసులు 500 మంది సర్వీస్ ప్రొవైడర్లను స్కాన్ చేసి ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తన పెళ్లి ప్రపోజల్ కాదన్నందుకే ఇలా చేశానని కునాల్ తెలిపాడు.