ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

by Sumithra |
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, ఖమ్మం రూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లాలోని కొండాపురం గ్రామానికి చెందిన నారపోగు సాయి తేజ(13) గుండె మనోజ్ కుమార్ (15) మంగళవారం ఇంటి నుంచి టీవీఎస్ ఎక్సెల్ పైన పొన్నెకల్ స్టేజి వద్ద గల బంక్ లో పెట్రోల్ పోయించుకొని తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న మారుతీ కారు, ఎక్సెల్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో సాయితేజ అక్కడికక్కడే మృతి చెందగా మనోజ్‌కు రెండు చేతులు, కాళ్ళు విరిగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగ్రాతున్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవూఫ్ తెలిపారు.

Advertisement

Next Story