ప్రియురాలు అలా అనడంతో.. పొలం వద్దకు వెళ్లి యువకుడు..

by Sumithra |
ప్రియురాలు అలా అనడంతో.. పొలం వద్దకు వెళ్లి యువకుడు..
X

దిశ, హుస్నాబాద్: ప్రేమ విఫలమైందని శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొహెడ మండలం మైసంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఏఎస్సై ఎండి. మజారుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. మైసంపల్లి గ్రామానికి చెందిన చిగురు ఆదర్శ్ (21) ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇంట్లో వారు మరో అబ్బాయితో పెళ్లి కుదర్చడంతో యువతి పెళ్లి నిశ్చయమైంది.

ఈ విషయంపై మృతుడు ప్రియురాలిని నిలదీయగా నీ చావు నువ్వు చావు అంటూ సదరు యువతి బదులివ్వడంతో ఆదర్శ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో వ్యవసాయ పొలం వద్ద మామిడి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని తండ్రి చిగురు రవీందర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడన్నారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed