TG Assembly: అసెంబ్లీ సమావేశాల్లో బిగ్ ట్విస్ట్.. నిరసనకు దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

by Shiva |
TG Assembly: అసెంబ్లీ సమావేశాల్లో బిగ్ ట్విస్ట్.. నిరసనకు దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) దద్దరిల్లాయి. ఓ వైపు భూ భారతి బిల్లు (Bhu Bharathi Bill)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) మాట్లాడుతుండగా.. బీఆర్ఎస్ (BRS) సభ్యులు ఫార్ములా ఈ-కారు రేసు (Formula E-Car Race) అంశంపై చర్చించాలంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలో వారంతా పేపర్లు చించి స్పీకర్ వైపు గాల్లో ఎగురవేస్తూ.. ప్లకార్టులతో వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను అవమానించారంటూ అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు. దళితుడైనా స్పీకర్ మీద పేపర్లు విసిరి అగౌరవపరిచారంటూ ఫైర్ అయ్యారు. సభలో అగౌరవంగా ప్రవర్తించింనందకు గాను బీఆర్ఎస్ (BRS) సభ్యులను సస్పెండ్ చేయాలని అన్నారు.

Next Story

Most Viewed