- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనుల పురోగతి ఏది : ఎంపీ డీకే అరుణ

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని అభివృద్ధి పనుల్లో పురోగతి కనబడటం లేదని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం మహబూబ్ నగర్ పద్మావతి కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో రైల్వే శాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆమె మాట్లాడారు. మహబూబ్ నగర్ పట్టణంలోని తిమ్మ సాని పల్లి, బొక్కలోనిపల్లి, ప్రాంతాల్లో రైల్వే గేటు ఇబ్బందులు, రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) ఏర్పాటుపై, అలాగే మోతి నగర్, న్యూ గంజ్, టిడి గుట్టు, వీరన్న పేట, పాలిటెక్నిక్ కాలేజీ వరకు డబ్లింగ్ పనులు, భూసేకరణ, ఇబ్బందులపై సుధీర్ఘంగా చర్చించారు.
దేవరకద్రలో ఆర్వోబీ, కౌకుంట్ల రైల్వే అండర్ బ్రిడ్జి, రైల్వే ట్రాక్ పనులపై ఆమె కీలకంగా చర్చలు జరిపారు. అటు మక్తల్ పరిధిలోని దేవరపల్లి లో రైల్వే ట్రాక్ కింద నుంచి పైప్ లైన్ పనులు, డోకూరు రైల్వే అండర్ బ్రిడ్జి పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతుందని ఒక్కింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దృష్టికి వచ్చిన రైల్వే సమస్యలన్నింటినీ సాధ్యమైనంత త్వరలో పరిష్కారం చూపుతామని రైల్వే శాఖ అధికారులు అన్నారు.ఈ సమీక్షలో రైల్వే శాఖ అధికారులు సంజయ్ కుమార్,జగదీష్, రాజు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈ ఈ దిలీప్ కుమార్, ఆర్డీవో నవీన్, ఏఈఈ రొక్కెందర్ రెడ్డి,డీఈఈ జైపాల్ రెడ్డి, ఏఈఈ శివానంద్, సర్వేయర్ రాఘవేందర్, తదితర రైల్వే అధికారులు పాల్గొన్నారు.