నా జీవితంలో కొత్త చాప్టర్ షురూ అంటున్న ‘పుష్ప- 2’ కొరియోగ్రాఫర్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

by Kavitha |
నా జీవితంలో కొత్త చాప్టర్ షురూ అంటున్న ‘పుష్ప- 2’ కొరియోగ్రాఫర్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ షోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి నేడు సినిమాల్లో కొరియోగ్రఫీ చేసే స్థాయికి ఎదిగిన శ్రష్టి వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢీ నుంచి బయటికి వచ్చాక కొన్ని సినిమాలకు అసిస్టెంగ్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ కింద పని చేసింది. ఆ తర్వాత జానీ మాస్టర్ నటించిన ‘యథా రాజా తథా ప్రజ’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం డ్యాన్స్ మాస్టర్‌గా ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది. ఇందులో భాగంగా రీసెంట్‌గ వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’ సినిమాలో టైటిల్ సాంగ్.. పుష్ప.. పుష.. అనే పాటకు విజయ్ పోలకితో పాటు శ్రష్టి కూడా కొరియోగ్రఫీ చేసింది. అయితే ఈ సాంగ్ ఫుల్ వీడియో బుధవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ భామ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

తాజాగా శ్రష్టి తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన పుట్టిన రోజు సందర్భంగా డైరెక్టర్ సుకుమార్‌తో అండ్ మూవీ టీమ్‌తో కేక్ కట్ చేసిన పిక్స్‌ను షేర్ చేస్తూ.. ‘పుష్ప-2 మూవీతో నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నాను’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. ఈ సారి బకరా అయ్యేది ఎవరో అని, పిల్ల మళ్లీ ఆట మొదలు పెట్టింది జర జాగ్రత్త పిల్లగాడ అని, ఎక్కువ రోజులు ఉండలేవు సినిమా ఫీల్డ్‌లో అంటూ ఏకిపారేస్తున్నారు.

Advertisement

Next Story