- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యవసాయమే నా నియోజకవర్గ ప్రజలకు ఆధారం : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
దిశ,ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వ్యవసాయమే ఆధారితంగా బతుకుతున్న రైతులు ఎంతోమంది ఉన్నారని ఉద్యోగ ఉపాధి లేక వ్యవసాయాన్ని జీవనాధారం గా రైతులు బతుకుతున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. అనంతరం నా నియోజకవర్గంలో రైతులకు,అటవీ భూముల సరిహద్దులకు ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి గిరిజన ప్రజలకు, అటవీ అధికారులకు మధ్య తరచుగా వివాదాలు ఉత్పన్నమవుతున్నందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన శాశ్వత పరిష్కారం కోసం ఈ సమస్యను సభ దృష్టికి తీసుకురావడం జరిగింది అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈ సమస్య విషయంలో ప్రత్యేకంగా చాలా మండలాల ప్రజలు విభిన్న రకాల సమస్యను ఎదుర్కొంటున్నారు.
రాజంపేట మండలం..
ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీసీ రైతులు గత 30 ఏళ్ల నుంచి అటవీ భూముల సరిహద్దులకు ఆనుకొని ఉన్న వ్యవసాయ భూముల్లో,రైతులు కాస్తులో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. వారు బీసీ సామాజిక వర్గానికి చెందినందున వారికి గతంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు జారీ చేయబడలేదు. కానీ ఇన్నేళ్లుగా వారిని ఏమనని అటవీ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన సంవత్సర పాలన కాలం నుంచి వారిని అక్కడ వ్యవసాయం చేయకుండా ఆ భూముల నుంచి ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ కి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అన్నారు.రాజంపేట మండలం ఎల్లాపూర్ తండా, హద్దు గుండు తండాలకు చెందిన చాలా మంది రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందినప్పటికీ, కొంతమంది గిరిజన రైతులకు కొన్ని సాంకేతిక కారణాలతో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు రాకపోవడంతో,దీంతో ఈ రైతులను కూడా అటవీశాఖ అధికారులు వ్యవసాయం చేయనివ్వడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
నాగిరెడ్డిపేట మండలంలో..
ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డి పేట మండలానికి చెందిన లింగంపేట, తాండూరు గ్రామాలలో సుమారుగా ప్రభుత్వ అసైన్డ్ భూమి 600 ఎకరాలలో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ల్యాండ్ రికార్డ్స్, అప్డేషన్ ప్రోగ్రాం, కంటే ముందు ఈ రైతులకు పాత పాస్ బుక్కులు ఉన్నాయి. వాటి మీద రుణాలు మంజూరు చేశారు, ఈ భూముల మీద యాజమాన్య హక్కులు సైతం రైతులు కలిగి ఉన్నారు. ఈ ల్యాండ్ రికార్డ్స్, అప్డేషన్ ప్రోగ్రాం, కార్యక్రమం నిర్వహించి కొత్త పాస్ బుక్కులు ఎప్పుడైతే జారీ చేశారో, ఈ సంబంధిత రైతులకు కొత్త పాస్ బుక్కులు జారీ చేయబడలేదు. అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఈ రైతులకు నూతన పాసు బుక్కులు జారీ చేయలేదని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులు రైతు భరోసా పొందడం లేదని రైతు బీమా, రుణమాఫీ వంటి ఈ వ్యవసాయ సంబంధిత పథకాలకు అర్హులు కావడం లేదని అన్నారు.
గాంధారి మండలం..
ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం గౌరారం గ్రామంలో 627 సర్వే నెంబర్ లో సుమారుగా 370 ఎకరాల విస్తీర్ణం ప్రభుత్వ అసైన్డ్ భూమిలో 210 మంది రైతులకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టా పాస్ బుక్ లు జారీ చేశాయి. ఈ రైతులు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు జారీ చేసిన పాస్ బుక్ ల ద్వారా యాజమాన్య హక్కులను అనుభవించడం తో పాటు పంట రుణాలను తీసుకోవడంతో పాటు వివిధ వ్యవసాయ సంబంధిత సంక్షేమ పథకాలను అనుభవించారు. ఇంతకుముందు చెప్పినట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ల్యాండ్ రికార్డ్స్, అప్డేషన్ ప్రోగ్రాం, కార్యక్రమం తర్వాత ఈ రైతులకు సైతం నూతన పట్టా పాస్ బుక్ లు జారీ చేయబడలేదు. ఈ 370 ఎకరాల భూమిని మా భూమి అని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు... కాదు మా భూమి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇలా రెండు ప్రభుత్వ శాఖల మధ్య నలుగుతూ ఆ రైతులు నష్టపోతున్నారు.
లింగంపేట మండలం..
ఎల్లారెడ్డి నియోజకవర్గ లింగంపేట మండలానికి చెందిన నల్ల మడుగు తండా కు చెందిన గిరిజన రైతు లక్ష్మణ్ నాయక్ తాను 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడుభూమికి ఆర్వో ఎఫ్ ఆర్, పట్టా పాస్ బుక్ రాకపోవడంతో ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సంబంధిత పట్టా పాస్ బుక్ రాకపోతే అడవి అధికారుల ఇబ్బందులతో వ్యవసాయం చేసుకోవడం కష్టం కాబట్టి ఎల్లారెడ్డి నియోజకవర్గ లింగంపల్లి మండలం ఎక్కపల్లి తండా, ఇతర మండలాల్లో సైతం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ద్వారా రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో మడులు కట్టనీయకుండా, పైప్ లైన్ వేయకుండా, బోర్లు వేయకుండా, ట్రాక్టర్ తో దున్నకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. దీనివల్ల ఈ వ్యవసాయ భూములన్నీ నిరూపయోగంగా మారి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలో ఉన్న కాయితి లంబాడాలు బీసీ సామాజిక వర్గం పరిధిలోకి వస్తారు. దీంతో వారు సాగు చేసుకుంటున్న పోడు భూములకు రాష్ట్ర ప్రభుత్వం (ఆర్ఓఎఫ్ఆర్) పట్టాలను జారీ చేయలేదు. దీంతో కాయితి లంబాడాలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు యాజమాన్య హక్కులు లేక అన్యాయమైపోతున్నారని అన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చాలావరకు తండాలు అటవీ భూముల సమీపంలోనే ఉంటాయి. అయితే ఈ తండాలకు చెందిన లంబాడాలు నూతన ఇండ్లు నిర్మించుకున్నప్పుడు... అటవీశాఖ అధికారులు అభ్యంతరం తెలిపి ఇండ్లు నిర్మించుకోనివ్వడం లేదు. అలాగే గత 30, 40 ఏండ్ల నుంచి ఉన్న గుడులను సైతం అభివృద్ధి చేసుకొని ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్న అన్ని గ్రామాల్లో రెవెన్యూ , అటవీశాఖ అధికారులతో జాయింట్ సర్వే ను నిర్వహించి వివాదాలు లేకుండా భూమి హక్కులను రైతులకు కల్పించవలసిందిగా కోరుకుంటున్నానని అన్నారు.
అలాగే ఆర్ఓఎఫ్ఆర్, పట్టాలు ఇచ్చిన భూములలో నీటి సదుపాయం కోసం బోర్లు వేసుకునే విధంగా, పైపులైను వేసుకునే విధంగా, అధునాతన వ్యవసాయ పనిముట్లతో వ్యవసాయం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని అటవీశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే మదనమోహన్ తెలిపారు. అదేవిధంగా తండాలలో గిరిజనుల ఇండ్ల నిర్మాణాలకు అటవీశాఖ అధికారులు అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో గిరిజన లంబాడాలు లబ్ధి పొందకుండా ఉండిపోతారు, కావున ఈ తాండాలలో ఇండ్ల నిర్మాణానికి అభ్యంతరం తెలుపకుండా అటవీశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.