నగ్న చిత్రాలతో ప్రాణం తీసింది…

by Anukaran |   ( Updated:2021-04-01 00:23:31.0  )
నగ్న చిత్రాలతో ప్రాణం తీసింది…
X

దిశ, నిజామాబాద్: ఈ మధ్య కాలంలో ఎవర్ని నమ్మలేకపోతున్నాం. డబ్బు కోసం ఎంతకైనా తెగించే వారు ఎక్కువైపోతున్నారు. ఆన్ లైన్ లో యువకులను వలలో వేసుకొని, వారిపైకి మత్తు వలలు విసిరి, నగ్న వీడియోలను రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంచుతున్నారు కొంతమంది కిలేడీలు. తాజాగా ఇలాంటి ఆన్ లైన్ చాటింగ్ ఒక యువకుడి ప్రాణం బలితీసుకుంది.వివరాలలోకి వెళితే నవీపేట్ మండలం కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు హైదరాబాద్ లోని క్షత్రియ హోటల్ మెనేజ్ మెంట్ సంస్థలో హోటల్ మెనేజ్ మెంట్ చదువుతున్నాడు.

ఇటీవలే అతనికి ఒక గుర్తు తెలియని యువతీ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ పరిచయం కాస్తా చిక్కబడి వీడియో కాల్స్ వరకు వెళ్ళింది. ఇక దీంతో ఒకరికొకరు నగ్న చాటింగ్లు చేసుకోవడం మొదలుపెట్టారు. శ్రీకాంత్ నగ్నంగా ఉన్న వీడియోలను ఆ యువతి రికార్డ్ చేసింది. ఆ తర్వాత తన గ్యాంగ్ సభ్యులతో కలిసి యువకుడిని బెదిరించడం మొదలు పెట్టింది. తనకు లక్షల్లో డబ్బు కావాలని, ఇవ్వకపోతే నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. తన దగ్గర అంత డబ్బు లేదని, తన అకౌంట్ లో ఉన్న 24 వేలను యువతి చెప్పిన అకౌంట్ కు పంపించాడు, అయినా ఆ యువతి కనికరించలేదు.పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్ చేసింది.

దీంతో తాను చేసిన తప్పును తల్లిదండ్రులకు చెప్పలేక, వీడియోలు బయటికి వస్తే పరువు పోతుందని అనుకున్న శ్రీకాంత్ ఈ నెల 27 న ఇంటికి వెళ్లి తన పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు బుధవారం మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story