వరుడు పరార్.. వధువు ఆందోళన

by Anukaran |   ( Updated:2020-07-31 04:23:32.0  )
వరుడు పరార్.. వధువు ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు పరారయ్యాడు. దీంతో ఆ యువతి.. యువకుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాచారం మండలం అయ్యవారిగూడెంలో ఓ యువతి ఆందోళన చేస్తోంది.

రెండు వారాల్లో పెళ్లి ఉండగా పెళ్లి కొడుకు పరారయ్యాడు. దీంతో ఆ యువతి పెళ్లి కొడుకు ఇంటి ముందు నిరసనకు దిగింది. టెంట్ వేసి ధర్నా చేస్తోంది. ఆమెతోపాటు బంధువులు, కుటంబ సభ్యులు ఉన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed