- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యువతి దారుణ హత్య
దిశ, నారాయణఖేడ్: పెండ్లి చేసుకోవాలని అడిగిన నేపథ్యంలో యువతిని ఆమె ప్రేమికుడు దారుణంగా హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోని నాగలిగిద్ద మండలం కరస్గుత్తికి చెందిన రాజప్ప నాగమ్మ దంపతులకు నలుగురు సంతానం. అయితే ఉపాధి నిమిత్తం రాజప్ప కుటుంబం హైదరాబాద్‌లోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనా నగర్‌లో 30 ఏండ్లుగా నివాసం ఉంటున్నారు.
వారి రెండవ కుమార్తె రబిక (రాధిక 22) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. పాతబస్తీకి చెందిన ముస్తాఫాతో రబిక ప్రేమలో పడింది. ఈ క్రమంలో ముస్తఫా ఇంటికి ఆమె శనివారం వెల్లింది. పెండ్లి చేసుకోవాలంటూ ముస్తఫాను రబిక నిలదీసింది. దీంతో ముస్తాఫా కుటుంబ సభ్యులకు, రబికకు మధ్య గొడవ జరిగింది. అర్థరాత్రి తర్వాత ముస్తాఫా, అతని సోదరుడు జమిల్ కలిసి రబికను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితులకు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కరస్ గుత్తి గ్రామానికి మృతదేహాన్ని తరలించారు.