మొదట ప్రేమన్నాడు.. తీర పెళ్లి వద్దన్నాడు

by Shyam |
మొదట ప్రేమన్నాడు.. తీర పెళ్లి వద్దన్నాడు
X

దిశ, సిద్దిపేట: ఇద్దరిది పక్కపక్క గ్రామాలు కావడంతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు పరిచయం కాస్త ప్రేమగా మారింది. నువ్వే నా ప్రాణమన్నాడు. ఆలయాల చుట్టూ తిప్పాడు. పలు సార్లు శారీరకంగా కలిశారు. తీరా ఆమె గర్భం దాల్చడంతో ఇక పెళ్లే వద్దన్నాడు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం తొర్నాల గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో కుటిగల్‌కు చెందిన ఓ యువతి ప్రేమలో పడింది. దాదాపు సంవత్సరం పాటు సాగిన ప్రేమ ప్రయాణంలో గుళ్లు, గోపురాలు, పార్కులు తిరిగారు. పలుసార్లు శారీరకంగా కలిశారు. దీంతో సదరు యువతి గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమని ప్రియుడిని అడిగితే మొహం చాటేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని అన్నది.

Advertisement

Next Story

Most Viewed